పనిమనిషితో భర్తను చూసిన భార్య, సర్దుకుపోదామన్న భర్త, ఆ తరువాత?

affair
జె| Last Modified సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:05 IST)
పనిమనిషితో యజమాని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు తెలియకుండా వీరి తతంగం సుమారు మూడు నెలల పాటు సాగింది. అయితే ఎక్కువరోజులు ఆ సంబంధం సాగదుగా.. భార్యే స్వయంగా వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని కళ్ళారా చూసేసింది. ఎలాగో తెలిసిపోయిందిగా... ఇంకేముంది సర్దుకుపోదాం.. ఇద్దరితోనూ ఉంటానంటూ భర్త చెప్పాడు. కానీ ఆ భార్య మాత్రం అందుకు అంగీరించలేదు.

వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్ నగరంలోని నిలోక్ ఏరియా పార్సనాథ్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న ముకేష్ వ్యాస్, అల్కా వ్యాస్ భార్యాభర్తలు. ప్రేమించి ఇద్దరూ పదిహేనేళ్ళ క్రితం పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకు ఆరోగ్యం బాగా లేదని ఒక పనిమనిషిని మాట్లాడాడు ముకేష్.

అయితే అందంగా ఉన్న పనిమనిషికి పడిపోయాడు ముకేష్. ప్రభుత్వ ఉద్యోగస్తుడు కావడంతో పనిమనిషి ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చేసేవాడు. ఇలా ఇద్దరి మధ్య మూడునెలల పాటు ఈ అక్రమ సంబంధం సాగింది. అయితే భార్య వీరి వ్యవహారాన్ని కళ్ళారా చూసి భర్తను నిలదీసింది.

పనిమనిషిని పని మాన్పించింది. కానీ ముకేష్‌ మాత్రం ఏకంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ పనిమనిషిని పెట్టాడు. దీంతో భార్యాభర్తలకు మధ్య తరచూ గొడవ జరుగుతూ వస్తోంది. భర్త టార్చర్ తట్టుకోలేని ఆ వివాహిత పోలీసులను ఆశ్రయించింది.దీనిపై మరింత చదవండి :