వామ్మో.. బెంగుళూరు మాల్‌లో గంటకు పార్కింగ్ చార్జి రూ.వెయ్యినా?
దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బెంగుళూరులో అన్ని రకాల వస్తువుల ధరలు ఎక్కువగానే ఉంటుంది. బెంగుళూరు నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఇపుడు దీన్ని నిరూపించే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు నగరంలోని ఓ మాల్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏకంగా వెయ్యి రూపాయలను వసూలు చేస్తున్నారు. అదీ కూడా ప్రీమియం పార్కింగ్ గంటకు మాత్రమే. దీనికి సంబంధించిన సైన్ బోర్డు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూబీ సిటీలో వాహనాల పార్కింగ్ ఫీజు తాలూకూ ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అందులో పార్కింగ్ ఫీజు గంటకు రూ.వెయ్యి అని ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇషాన్ వైష్ అన్ ట్విట్టర్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. దాంతో ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. యూబీ సిటీ పార్కింగ్‌లో ఏదైనా ప్రత్యేకత ఉందా? దీనికోసం వారు గంటకు ఏకంగా రూ.1000 వసూలు చేస్తున్నారు" అని కామెంట్ చేశారు. కాగా, రాజధాని నగరంలో 2015 వరకు పార్కింగ్ ఫీజు గంటకు కేవలం రూ.40 మాత్రమే ఉండేది. కానీ వాహనాల సంఖ్య ప్రతి యేటా భారీగా పెరిగిపోవడంతో పార్కింగ్ సమస్య తలెత్తింది. దీంతో ప్రస్తుతం వాహనాల పార్కింగ్ స్థలం కూడా ఓ బడా వ్యాపారంగా మారిపోయింది.