ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (08:56 IST)

దీపావళికి 10 రోజులు సెలవులు ప్రకటించిన కంపెనీ..?

Diwali
దీపావళి పండుగకు రెండు రోజుల సెలవుల గురించి విని వుంటాం. అయితే ఓ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ వీవర్క్ సంస్థ ఇండియన్ ఎంప్లాయీస్‌కు ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో అదిరే శుభవార్త అందించింది. ఎక్స్‌టెండెడ్ బ్రేక్ అందిస్తున్నట్లు ప్రకటించింది.
 
కంపెనీ ఉద్యోగులకు 10 రోజుల విరామం అందించింది. ఈ హాలిడే బ్రేక్‌లో ఉద్యోగులు పని నుంచి దూరంగా ఉండాలని తమ ప్రియమైన వారితో కలిసి వేడుకలు చేసుకోవచ్చు. పది రోజుల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా, ఆఫీస్ పనులకు దూరంగా ఉండొచ్చు. తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
 
ఫ్లెక్సిబిలిటీ, వర్క్ లైఫ్ ఇంటీగ్రేషన్, పండుగ వేడుకల ఆనందాన్ని పంచుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామని వీవర్క్ పేర్కొంది. 2021లో తొలిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని కంపెనీ తెలిపింది. అంటే కంపెనీ రెండో సారి తన ఉద్యోగులకు ఇలాంటి హాలిడే బ్రేక్ అందిస్తోందని చెప్పుకోవచ్చు.  
 
కాగా కేవలం పది రోజుల దీపావళి సెలవులు మాత్రమే కాకుండా ఉయ్‌వర్క్ ఇండియా కంపెనీ తన ఉద్యోగులకు వెల్‌నెస్ లీవ్, ఎంప్లాయీస్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ (ప్రొఫెషనల్ కౌన్సెలింగ్‌ అందించడం వంటివి), కమ్యూనిటీ సేవ కోసం ఇంపాక్ట్ లీవ్, ఇన్‌క్లూసివ్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వంటి సేవలు కూడా అందిస్తోంది.