శనివారం, 23 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 అక్టోబరు 2022 (12:53 IST)

కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన ఇంటర్ బోర్డు.. ఎందుకు?

students
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అక్టోబరు మూడో తేదీన నుంచి దసరా సెలువులు ఇచ్చింది. ఈ నెల పదో తేదీన మళ్లీ కాలేజీలు తెరుచుకుంటాయి. అయితే, కొన్ని ప్రైవేటు కాలేజీలు ఈ సెలవుల్లో కూడా తరగతులను నిర్వహిస్తుంటాయి. ఇలాంటి కాలేజీలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరిక చేసింది. ఈ సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరిట తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏకంగా గుర్తింపునే రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
అలాగే, కశాలలు, యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్, కో ఆపరేటివ్, గురుకుల కాలేజీలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు.