శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:53 IST)

యూపీలో మహిళపై ముగ్గురు వైద్యుల సామూహిక అత్యాచారం..

gang rape
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో మహిళపై అత్యాచారం చేసినందుకు ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలోని ఓ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులపై పోలీసులు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసినట్లు సెప్టెంబర్ 29న ఒక అధికారి తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. బస్తీ సదర్ కొత్వాలిలోని కైలీ ఆసుపత్రిలో పోస్ట్ చేయబడిన ఒక వైద్యుడు సోషల్ మీడియాలో లక్నోకు చెందిన అమ్మాయితో స్నేహం చేశాడు. ఆమెను తన ఆస్పత్రికి పిలిచాడు.
 
ఆగస్టు 10న వచ్చిన ఆమెను.. తన హాస్టల్‌ రూముకు తీసుకెళ్లాడు. అక్కడే తన ఇద్దరు సహచర వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు సదర్ కొత్వాలి వద్ద కేసు నమోదు చేయబడింది.