మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (12:05 IST)

కోర్కె తీరిస్తే ఎక్కువ మార్కులొస్తాయ్... హాస్టల్‌లో భార్యగా ఉంటూ జీవితంలో సెటిల్‌ కావొచ్చు...

హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేసే విద్యార్థినిల కష్టసుఖాల్లో పాలు పంచుకుని వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన మహిళా వార్డన్లే చివరకు.. ఓ విద్యార్థినిని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పక్కలో పడుకోబెట్టేందుకు ప్

హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేసే విద్యార్థినిల కష్టసుఖాల్లో పాలు పంచుకుని వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన మహిళా వార్డన్లే చివరకు.. ఓ విద్యార్థినిని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పక్కలో పడుకోబెట్టేందుకు ప్రయత్నించారు. కాస్త పెద్ద మనసుతో ఒప్పుకో.. ఆయన కోర్కె తీర్చు.. ఇదే కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరవచ్చు అంటూ ప్రోత్సహించారు. దీంతో షాక్‌కు గురైన ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసింది. ఈ దారుణం తమిళనాడులోని ప్రభుత్వ అగ్రికల్చర్ కాలేజీలో చదువుకునే ఓ విద్యార్థినికి జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. చెన్నై పెరుంగుడికి చెందిన 22 ఏళ్ల యువతి తిరువణ్ణామలై జిల్లా తాండ్రాంపుట్టు సమీపంలో ఉన్న వాళవచ్చనూరు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్‌లోనే ఉంటోంది. ఇదే కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మదురైకి చెందిన తంగపాండ్యన్ (40) రాత్రివేళల్లో హాస్టల్‌కు వెళ్లి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. 
 
ఈ వేధింపులను తట్టుకోలేని ఆ యువతి... హాస్టల్‌ మహిళా వార్డన్ల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాతే ఆమెకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అదీ కూడా మహిళా వార్డన్ల నుంచి కావడం గమనార్హం. అసిస్టెంట్‌ ప్రొఫెసర్, మహిళా వార్డన్లు సెల్‌ఫోన్‌ ద్వారా తనతో జరిపిన సంభాషణను బాధిత విద్యార్థిని రికార్డు చేసి తండ్రి ద్వారా ప్రిన్సిపాల్‌కు అప్పగించింది. 
 
తన కోర్కె తీరిస్తే ఎక్కువ మార్కులు వచ్చేందుకు సహకరిస్తానని ఆశపెట్టడం, మహిళా వార్డన్లు సైతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చెప్పినట్లు నడుచుకో, మంచి మార్కులతో పాసై ఇదే కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరవచ్చు.. అతడికి రెండో భార్యగా ఉంటూ జీవితంలో సెటిల్‌ కావచ్చని విద్యార్థినితో అన్న మాటలు నమోదయ్యాయి. 
 
గ్రామస్తుల ఆందోళనతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, ఇద్దరు మహిళా వార్డన్లపై ప్రిన్సిపాల్‌ విచారణ చేపట్టారు. పైగా ఈ అంశం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా విచారణ చేపట్టారు. అలాగే, బాధిత విద్యార్థిని కోర్టును ఆశ్రయించడంతో బాధితురాలిని మరో కాలేజీలోకి మార్చాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.