శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2017 (17:22 IST)

శశికళకు తమిళనాడు సీఎం వెన్నుపోటు...? జయమ్మ మరణంపై న్యాయ విచారణ

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణ జరిపించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఇది అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవ

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణ జరిపించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఇది అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తేరుకోలేని షాకిచ్చారు. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు.. చెన్నై, పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసమైన వేద నిలయంను స్మారక మందిరంగా మార్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా.. దివంగత ముఖ్యమంత్రి జయలలితపై జ్యుడీషియల్ విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 
 
విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని పళని తెలిపారు. ఈ కమిటీని త్వరలోనే నియమిస్తారు. దర్యాప్తుకు నిర్దిష్ట గడువును విధిస్తున్నట్లు తెలుస్తోంది. 'అమ్మ' జయలలిత మరణంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.