ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:30 IST)

ప్రియురాలి ఇంటికి చాటుగా వెళ్లాడు.. ఆమె భర్త చేతిలో తన్నులు తిన్నాడు...

ప్రియురాలి ఇంటికెళ్లి అడ్డంగా బుక్కైన ఈబీ ఉద్యోగి.. పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేయడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, సేలం జిల్లా, మేట్టూరు ఈబీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి.. ప్రియురాలి ఇంటికి ఎవ్వరికీ తెలియకుండా వెళ్లాడు. అయితే అక్కడ ప్రియురాలి భర్త చేతిలో తన్నులు తిన్నాడు. 
 
అయితే ప్రియురాలి భర్త చేతిలో దాడికి గురయ్యాననే విషయాన్ని దాచేందుకు కరోనా లాక్ డౌన్ కారణంగా డ్యూటీలో వున్న పోలీసులు తనపై దాడి చేశారని డ్రామా చేశాడు. దీన్ని నిజమని నమ్మిన సహ ఉద్యోగులు ఈబీ సంఘం ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఫిర్యాదు డీఎస్పీ వరకు వెళ్లడంతో విచారణ జరిగింది. ఈ విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు అధికారి తన తప్పును దాచేందుకు పోలీసులు దాడి చేసినట్లు వెల్లడి అయ్యింది. దీంతో ఆ ఉద్యోగిని పోలీసులు సస్పెండ్ చేశారు.