శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (13:23 IST)

పోకిరి వెకిలి చేష్టలు.. అమ్మాయిలు కనిపిస్తేచాలు హగ్గింగ్స్.. కిస్సెస్

ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు హడలిపోతున్నారు. ఈ వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయంతో వణికిపోతు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే, ఓ యువకుడు మాత్రం వెకిలి చేష్టలతో ఒంటరిగా కనిపించే అమ్మాయిలు, మహిళలను మాత్రం బెంబేలెత్తిస్తున్నారు. నేను సింగిల్‌.. ఒక హగ్గిస్తావా అంటూ హల్‌చల్ చేస్తున్నాడు. అతని వ్యాఖ్యలకు ఎవరైనా కోపగించుకుంటే.. జస్ట్ ఫర్ ఫన్.. అద పాంక్ వీడియో అంటూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. అతనికి పోలీసులు సరైన గుణపాఠం నేర్పారు. ఇది హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 
 
హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ కేవీఎం ప్రసాద్ వెల్లడించిన వివరాల మేరకు... తన యాప్‌లోకి వచ్చి ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడండి.. సబ్‌స్క్రైప్‌ చేయండి, ఇంకా మరెన్నో ఫన్నీ చేయండంటూ ప్రచారం చేసుకుంటూ.. నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌, కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ... అమ్మాయిలను కౌగిలింతలు అడుగుతూ.. వాళ్లు చీకొట్టగానే అది ప్రాంక్‌ అంటూ ఓ యువకుడు వెకిలి చేష్టలు చేస్తున్నాడు. 
 
దీనిపై అసహనానికి గురైన ఇద్దరు యువతులు శుక్రవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. డ్రీమ్‌ బాయ్‌ సూర్యతేజ పేరుతో రామావత్‌ సురేశ్‌ అనే యువకుడు ఈ ఘనకార్యానికి  పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.