శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (09:21 IST)

పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారానికి కేజ్రీవాల్ అభినందనలు.. కేంద్రం తిప్పికొట్టాలి

పాకిస్థాన్‌లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సై

పాకిస్థాన్‌లో అత్యవసరంగా విమానాలు కిందకు దించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని పైలట్లకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సూచించింది. దాయాది దేశంలో విమానం దించితే అదే మనకు తుది గమ్యం అవుతుందని హెచ్చరించింది. భారత సైన్యం మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో తమ భూభాగంలోని గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మీదుగా రాకపోకలు సాగించే విమానాల పైలట్లకు ఎయిర్ ఇండియా పలు జాగ్రత్తలు సూచించింది.
 
సర్జికల్ దాడులపై పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కేంద్ర సర్కారు అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. దాడులపై పాక్‌ దుష్ప్రచారాన్ని బయటపెట్టిన మీడియాను సీఎం అభినందించారు. ''పలు మీడియా సంస్థలు పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. వారిని నా అభినందనలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే పాక్‌ దుష్ప్రచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టాలి'' అని సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.
 
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఓ అధికారి తమ భూభాగంలో సర్జికల్‌ దాడులు జరిగినట్లు ఒప్పుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలను కేజ్రీవాల్‌ ఊటంకించారు. సర్జికల్‌ దాడుల అనంతరం సోమవారం ఓ వీడియో మెసేజ్‌ విడుదల చేసిన సీఎం కేజ్రీవాల్‌ అందులో పాకిస్థాన్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.