14 వరకు రైళ్లూ నడవబోవు

railway track
ఎం| Last Updated: గురువారం, 26 మార్చి 2020 (07:41 IST)
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు 21రోజులు లాక్‌డౌన్ పాటించాలని భారత ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 31 వరకూ గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన రైల్వేశాఖ ఈ గడువును ఏప్రిల్ 14 వరకూ పొడిగించింది. ఏప్రిల్ 14 వరకూ గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లు పట్టాలెక్కవని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

బస్సుల కంటే రైళ్లలోనే దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికమంది ప్రయాణిస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుతో రవాణ సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఎప్పుడూ పట్టాలపై రయ్‌..రయ్‌ మంటూ తిరిగే రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.
దీనిపై మరింత చదవండి :