మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (19:36 IST)

ఢిల్లీలో ఇక అందరికీ చికిత్స

ఢిల్లీ వాసులకు తప్ప బయటివారికి చికిత్స చేయబోమంటూ ప్రకటించిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. మనసు మార్చుకున్నారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సను ఢిల్లీయేతరులకు కూడా చికిత్స అందించాలంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజ్వాల్‌ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రకటించారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్సను ఢిల్లీయేతరులకు కూడా చికిత్స అందించాలంటూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఢిల్లీలో 31,309 కేసులు నమోదయ్యాయని, జులై 31 నాటికి 5 లక్షల కేసులు పెరుగుతాయని కేజ్రీవాల్‌ హెచ్చరించారు.

ప్రభుత్వం ముందు భారీ సవాలు ఉందని, జులై 15 నాటికి 33వేల బెడ్‌లు అవసరమౌతాయని, నగరం వెలుపల ఉన్నవారితో కలిపితే మొత్తంగా 65వేల బెడ్‌లు కావాలని, ఈ లెక్కన జులై 31 నాటికి కరోనా బాధితులకు చికిత్సనందించేందుకు 1.5లక్షల బెడ్‌లు అవసరమౌతాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. స్టేడియమ్స్‌, కళ్యాణమండపాలు, హోటల్స్‌ను కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు యత్నిస్తామని, బాధితులందరికీ చికిత్సనందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.