బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (19:31 IST)

ఢిల్లీ మద్యం ప్రియులకు శుభవార్త!.. కరోనా స్పెషల్ ఫీజు తొలగింపు

ఢిల్లీ మద్యం ప్రియులకు శుభవార్త! లాక్‌డౌన్ సమయంలో మద్యంపై విధించిన కరోనా స్పెషల్ ఫీజును తొలగిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల పది నుంచి అమల్లోకి రానుంది.
 
నెల క్రితం ఢిల్లీలో మద్యంపై 70 శాతం కరోనా స్పెషల్ ఫీజు విధించడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రారంభంలో మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగినా ధరలు ఎక్కువగా ఉండటంతో తర్వాత తగ్గిపోయాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కరోనా స్పెషల్ ఫీజును తొలగించింది.

అయితే మద్యంపై వ్యాట్ మాత్రం 20 నుంచి 25 శాతానికి పెంచారు. మిగతా ప్రభుత్వాలు కూడా త్వరలోనే మద్యం ధరలను తగ్గించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 75 శాతం అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు.