శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (16:16 IST)

పెళ్లైన తర్వాత ప్రేమ.. నువ్వు నాకే సొంతమని కత్తితో పొడిచేశాడు..

''నువ్వు నాకే సొంతం.. నన్నే ప్రేమించాలి. నిన్ను ఎవ్వరి కోసమూ వదులుకోను'' అంటూ ఓ కళాశాల విద్యార్థినిని ప్రేమోన్మాది వేధించాడు. మరో అడుగు ముందుకేసి నాకు దక్కని నీవు ఎవరికి సొంతం కాకూడదన్నాడు. చివరికి ప్రేమోన్మాదిగా మారి.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఇంకా ప్రేమ కోసం ఉన్మాదిగా మారే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుచ్చి, తెన్నూరు, పుదుమారియమ్మన్ ఆలయానికి సమీపంలో అయ్యప్పన్ అనే వ్యక్తి నివసిస్తుండేవాడు. ఇతని కుమార్తె మలర్ వియి. ఈ ఆ ప్రాంతంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. 
 
ఇలా వుంటే చెన్నై ఐఐటీలో పనిచేస్తూ వచ్చిన బాలమురళీ అనే వ్యక్తికి మలర్ వియిపై ప్రేమ పుట్టింది. అప్పటికే బాలమురళీకి భార్య, పిల్లలున్నారు. చెన్నైలో వుంటూ ఉద్యోగం చేస్తున్న బాలమురళీ.. తిరుచ్చిలోని భార్యాపిల్లల్ని చూసేందుకు అప్పుడప్పుడు వెళ్తూ వుండేవాడు. ఇలా ఆ ప్రాంతానికి చెందిన మలర్‌విలిపై కన్నేశాడు. ఆపై ఆమెను ప్రేమించాల్సిందిగా వేధించడం మొదలెట్టారు. 
 
అయితే మలర్ వియి బాలమురళీ ప్రేమను నిరాకరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కాలేజీ ముగించి ఇంటికి వస్తుండగా, మలర్‌ను అడ్డుకున్న బాలమురళీ ఆమెను ప్రేమించాల్సిందిగా వేధించాడు. పెళ్లికి ముందు నుంచే మలర్‌ను ప్రేమిస్తూ వచ్చిన బాలమురళీ.. ఆమె ప్రేమను అంగీకరించకపోయే సరికి కత్తితో పొడిచి చంపేశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మలర్ బాలమురళీకి చెల్లెలు వరస అవుతుందని.. ఎంత చెప్పినా అతడు ప్రేమించాలని వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది.