స్విమ్మింగ్ పూల్‌లో సీత ఏం చేస్తుంది.. ఫోటోలు వైరల్

Last Updated: సోమవారం, 3 జూన్ 2019 (12:07 IST)
మొన్నటికి మొన్న డీ-గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్‌లో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తాను మాత్రమే గాకుండా తన సోదరి, సినీ నటి నిషా అగర్వాల్‌తో స్విమ్మింగ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిషా అగర్వాల్‌తో ఆమె బుల్లి కుమారుడు కూడా వున్నాడు. 
 
కాగా.. బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, సోనూ సూద్, మ‌న్నారా చోప్రా, అభిమ‌న్యు సింగ్, త‌ణికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు నటించిన ''సీత'' సినిమా ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. ఇక కాజల్ తాజా ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి. 

 
దీనిపై మరింత చదవండి :