గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (16:10 IST)

కోల్‌కతా సినిమా హాలులో భారీ అగ్ని ప్రమాదం..

దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అనేకమైన అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో కోవిడ్‌ ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాల వల్ల ఎంతో మంది కోవిడ్‌ బాధితులు అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలు విఫలం కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
 
తాజాగా కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జయ సినిమా థియేటర్‌లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి 15 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. 
 
అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి సమయంలో జయ సినిమా హాల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.