బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (09:52 IST)

నవీన్ హత్య కేసు మరో ట్విస్ట్.. ప్రేమ వ్యవహారమే కారణమట!

murder
సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య తర్వాత హరిహరకృష్ణ స్నేహితురాలు అతనికి డబ్బు పంపిందని పోలీసులు వెల్లడించారు.
 
ప్రియురాలు నిహారిక రెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. 
 
నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య విషయం నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హత్య విషయం హసన్‌కు కూడా తెలుసు. నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
 
నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి సాక్ష్యాలను తారుమారు చేసింది. నవీన్ హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.