1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 మార్చి 2023 (09:38 IST)

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 1.5 కోట్ల ఆస్తి రాసిచ్చిన వృద్ధుడు

తన కుటుంబంపై అసంతృప్తితో వున్న ఓ వృద్ధుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన 80 ఏళ్ల వ్యక్తి, తన కొడుకు, కోడలు తనను అసభ్యంగా ప్రవర్తించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
 
వివరాల్లోకి వెళితే.. నాథు సింగ్‌ అనే వృద్ధుడు రూ. 1.5 కోట్ల విలువైన ఇల్లు, భూమి ఉంది. అతనికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని కుమారుడు సహరాన్‌పూర్‌లో ఉంటూ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. 
 
అతని భార్య మరణం తరువాత, వృద్ధుడు ఖతౌలీలోని వృద్ధాశ్రమంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. తన కుటుంబ సభ్యులెవరూ తనను చూడటానికి కూడా రాలేదని నాథు సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత అతను ఆస్తిని యుపి ప్రభుత్వానికి అప్పగించాలని అఫిడవిట్ దాఖలు చేశాడు.
 
తన మరణం తరువాత ప్రభుత్వం పాఠశాల లేదా ఆసుపత్రిని తెరవడానికి భూమిని ఉపయోగించుకోవచ్చని అభ్యర్థనను జోడించాడు.
 
"ఈ వయసులో నేను నా కొడుకు, కోడలుతో కలిసి జీవించాలి కానీ వారు నన్ను బాగా చూసుకోలేదు. అందుకే ఆస్తిని బదలాయించాలనే నిర్ణయం తీసుకున్నాను" అని సింగ్ మీడియాతో అన్నారు.