మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (08:09 IST)

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. గత రెండు మూడు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆయన వైద్యులను సంప్రదించి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు ఫలితాలు తేల్చాయి. 
 
తన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. తనకు కొంత అనారోగ్యంగా ఉండడంతో వైద్యుడిని సంప్రదించానని, కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని గడ్కరీ సూచించారు.