శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (12:09 IST)

యూపీఎస్సీ కీలక ప్రకటన.. పరీక్షల క్యాలెండర్ రిలీజ్

upsc
యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (UPSC) కీలక ప్రకటన వెలువరించింది. వచ్చే ఏడాది యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షలకు సంబంధించిన పరీక్షలకు సంబంధించిన ఎగ్జాం క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఐఎఫ్‌ఎస్‌, ఐఈఎస్, ఎన్‌డీఏ అండ్ సీడీఎస్‌తో సహా సలు ముఖ్యమైన పరీక్షల తేదీలను ఎగ్జాం క్యాలెండర్‌లో పేర్కొంది. 
 
కాగా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్-ఏ ఆఫీసర్స్ పోస్ట్‌లతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీకి ఇది నియామక ప్రక్రియను చేపడుతుంది. యూపీఎస్సీ ఎన్‌డీఏ అండ్ సీడీఎస్ (I)-2024 రాత పరీక్ష ఏప్రిల్ 21న జరుగుతుంది. 
 
ఈ క్యాలెండర్ ప్రకారం.. యూపీఎస్సీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (IES) ప్రిలిమినరీ పరీక్ష జూన్ 21వ తేదీన జరుగుతుంది. యూపీఎస్సీ సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ – 2024 మార్చి 10న జరుగుతుంది.