యురీ దాడి ఘటన : మరో సైనికుడి వీరమరణం.. పాక్ మరో దుస్సాహసం... అఖ్నూర్ సెక్టార్‌లో కాల్పులు
జమ్మాకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో వీరమరణం పొందిన సైనికుల సంఖ్య శుక్రవారానికి 19కి చేరుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాను రాజ్‌కిషోర్
జమ్మాకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో వీరమరణం పొందిన సైనికుల సంఖ్య శుక్రవారానికి 19కి చేరుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాను రాజ్‌కిషోర్ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ఆయన వీరమరణంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 19కి చేరుకుంది.
పాకిస్థాన్, భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై భారత్ ధీటైన జవాబు ఇస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి దుస్సాహసం చేసింది. ఓవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై భారత్ ఇరుగుపొరుగు దేశాలతో పాటు అనేక దేశాలు స్పందిస్తుండగా, మరోవైపు పాకిస్థాన్ బలగాలు ఈరోజు ఉదయం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాయి.
జమ్మూకాశ్మీర్ అఖ్నూర్ సెక్టార్‌లోని చప్రియల్, సమ్వాన్ ప్రాంతాల్లో శుక్రవారం పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉందని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్‌దీప్ సింగ్ పేర్కొన్నారు. గడిచిన 48 గంటల్లో ఐదోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.