గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఒకటో తరగతి విద్యార్థినిపై ఐదో తరగతి బాలుర రేప్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత చిన్నారి గట్టిగా ఏడవడంతో అటుగా వెళ్తున్నవారు వచ్చి కాపాడారు. 
 
దీనిపై బాధిత చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై స్థానిక మీడియాలో వార్తలు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై చర్యలు ప్రారంభించారు. ఇద్దరు టీచర్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేశారు. మరో ఏడుగురిని సస్పెండ్‌ చేశారు.