శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (13:32 IST)

మైనర్ బాలికపై అత్యాచారం.. యూపీలో పెచ్చరిల్లిపోతున్న నేరాలు

ఉత్తరప్రదేశ్‌లో నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హత్యచేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే ప్రాంతంలో తాజాగా మరో 17ఏళ్ల మైనర్‌ బాలికపై ఇదే తరహాలో అఘాయిత్యానికి పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ జిల్లాలో ఈ వరుస ఘటనలు వెలుగు చూశాయి. 
 
వివరాల్లోకి వెళితే.. 17 ఏళ్ల మైనర్‌ బాలిక సోమవారం ఉదయం స్కాలర్‌షిప్‌ దరఖాస్తు నింపేందుకు ఇంటి నుంచి సమీప గ్రామానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. అమ్మాయి కోసం గాలిస్తుండగా రెండురోజుల అనంతరం గ్రామ శివారులో ఎండిపోయిన చెరువు నుంచి దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూశారు. శరీర భాగాలు ముక్కలుగా పడివున్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
 
పోస్టుమార్టం నిర్వహించగా ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారని లఖీంపూర్‌ ఖేరీ ఎస్పీ సతేంద్ర కుమార్‌ సింగ్‌ తెలిపాడు. నిందితులకు సంబంధించిన ఆనవాళ్లు అభించాయని, వారికోసం ప్రత్యేక పోలిసు బృందం గాలిస్తోందని చెప్పారు. పది రోజుల క్రితం అదే జిల్లాలోని ఇసానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దుండగులు 13ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు.