మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (13:03 IST)

అందరినీ చంపేయాలని ప్లాన్.. టీలో విషం కలిపింది.. చివరికి?

అత్తింటివారు, భర్తతో కలిసి ఉండలేనని ఓ మహిళ.. అందరినీ ఒకేసారి చంపేయాలని ప్లాన్ వేసింది. అందుకు టీలో విషం కలిపి అందరికీ ఇచ్చింది. దాంతో 16 నెలల ఓ బాలుడు మృతిచెందగా.. మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ లోని బహ్రాయిచ్ లో మచియాహీ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలనుకుంది. సోమవారం భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు సృష్టి లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
అంకిత వదిన శివాని కుమారుడు రుద్రాన్ష్ మాత్రం మృతిచెందాడు. బహ్రాయిచ్ అదనపు ఎస్పీ కున్వార్ జ్ఞానాంజయ్ సింగ్ దీనిపై మాట్లాడుతూ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసు నమోదుచేసి అంకితను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వివాహేతరం సంబంధం కూడా ఇందుకు కారణమాని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.