గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:38 IST)

కోర్టులో బాంబులు విసిరిన లాయర్.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఓ లాయర్ క్రూడ్ బాంబులతో తోటి లాయర్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక లాయర్‌కి తీవ్ర గాయాలవగా, మరో ఇద్దరు స్వల్ప గాయాల పాలయ్యారు. రెండు లాయర్ల గ్రూపుల మధ్య వివాదం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
 
 గురువారం మధ్యాహ్నం లక్నో కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఓ కోర్టులోని బార్ అసోసియేషన్ సెక్రెటరీ సంజీవ్ లోధీ ఆఫీసులో మరో లాయర్ క్రూడ్ బాంబులు విసిరేశాడు. 
 
మూడు నాలుగు బాంబులు విసరగా.. వాటిలో ఒకటి పేలింది. దీంతో అక్కడ ఉన్న సంజీవ్ లోధీ, మరో లాయర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే లోధీని కలిసేందుకు వచ్చిన ఓ లాయర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. 
 
పేలకుండా ఉన్న మూడు బాంబులను గుర్తించారు. వాటిని జాగ్రత్తగా డిస్పోజ్ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.