1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (15:05 IST)

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలి ఇద్దరికి తీవ్రగాయాలు

కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వరి మగాణీ పొలంలో గడ్డిని తీసుకొని రావడానికి అంబారుపేట గ్రామానికి చెందిన డ్రైవరు ఇద్దరు  కూలీలతో కలిసి వెళ్లి వరి గడ్డిని ట్రాక్టర్ పై లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలో పంట పొలాల్లో కిందకి వేలాడుతున్నాయి. ఈ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టరుతో సహా వరిగడ్డితో పాటు వరిగడ్డిపై కూర్చున్న ఇద్దరు కూలీలు, ఒక కూలీ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవరు మరో కూలికి తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
 
విద్యుత్ అధికారులు కేవలం అక్రమ సంపాదనకు అలవాటు పడి గ్రామాలలో కరెంటు వైర్లు కిందకి వేళ పడుతున్నాయని గ్రామస్తులు ఎన్నిసార్లు తెలియపరిచిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోతున్నాకూడా మావి కావులే ప్రాణాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్న కిందకి వేలాడుతున్నాయి విద్యుత్ తీగలను మరమ్మతులు చేసి మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.