శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (10:22 IST)

దున్నపోతుపై వచ్చి.. నామినేషన్ వేసీ... ఎక్కడో తెలుసా?

ఇప్పటి వరకూ పాలించిన ప్రభుత్వం సరైన చలనం లేకుండా దున్నపోతు మాదిరిగా పాలించిందని చెప్పేందుకు బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థి వెరైటీగా ప్రయత్నించాడు. నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు దున్నపోతుపై వచ్చాడు.
 
నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలోనూ అభ్యర్థులు వినూత్న పద్ధతులను పాటిస్తున్నారు.

దర్భంగా జిల్లాలోని బహదుర్‌పురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న నాచారి మండల్‌ అనే వ్యక్తి దున్నపోతుపై వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.