శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (10:15 IST)

మహారాష్ట్రలో విషాదం.. పడవ ప్రమాదంలో 40 మంది గల్లంతు?

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో విషాదం నెలకొంది. జనాలతో వెళ్తున్న రెండు పడలు ఇంద్రావతి నదిలో బోల్తా పడ్డాయి.. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతు అయ్యారు..ప్రమాదం నుంచి 13 మందిని స్థానికులు రక్షించారు.

వీరందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు..చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు..అయితే గల్లంతు అయినా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..గల్లంతు అయినా వారు సిరోంచ తాలూక సోమనపల్లి వాసులుగా గుర్తించారు.
 
అయితే సామర్థ్యానికి మించి పడవలో జనాలు ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు..ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
బస్సుబోల్తా.. ఐదుగురి మృతి
మహారాష్ట్రలో బస్సుబోల్తా పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం ఉదయం విసర్వాడీ సమీపంలోని కొండైబారి ఘాట్‌ సమీపంలోని లోయలో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 31 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

మల్కాపూర్‌ నుండి సూరత్‌ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిందని, ఈ ఘటనలో బస్స డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు మరణించారు.