శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (15:50 IST)

తుపాకీ మోతలతో దద్దరిల్లిన రోహిణి కోర్టు.. లాయర్ దుస్తుల్లో వచ్చి..?

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తుపాకీ మోతలతో న్యాయస్థానం దద్దరిల్లింది. కోర్టు రూమ్‌లోనే రక్తం ఏరులై పారింది. లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు కోర్టు ఆవరణలో కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. రోహిణి కోర్టు రూమ్ 207లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాంగ్‌స్టర్‌ను చంపేందుకు అతని ప్రత్యర్థులు మారువేషాల్లో వచ్చి తమ పగతీర్చుకున్నారు.
 
ఓ కేసు విషయంలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర గోగి అలియాస్‌ దాదాని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా.. లాయర్ డ్రెస్సులో వచ్చిన ముగ్గురు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు కోర్టు ఆవరణలోనే జితేందర్ గోగిపై కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో జితేందర్ అక్కడిక్కడే మృతి చెందాడు. అప్రమత్తమైన పోలీసులు దుండగులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు దుండగులు మరణించారు. 
 
కాగా.. కాల్పులకు పాల్పడిన వారిని టిల్లు తాజ్ పూరియా గ్యాంగ్ సభ్యులుగా అనుమానిస్తున్నట్లు రోహిణి డీసీపీ ప్రణవ్ తయాల్ తెలిపారు. అదేమీ గ్యాంగ్ వార్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. 30 ఏళ్లు గోగిని మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద ఏప్రిల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గోగిపై 19 మర్డర్ కేసులను ఉన్నాయి. వీటితో పాటు డజన్ల సంఖ్యలో బెదిరింపులు, దొంగతనాలు, చోరీలు ఉన్నాయి. కార్లు కూడా ఎత్తుకువెళ్లిన కేసులు అతనిపై ఉన్నాయి.