ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (12:18 IST)

జేపీసీకి వక్ఫ్ చట్టం సవరణకు బిల్లు

loksabha
వక్ఫ్ చట్టం సవరణ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించారు. ఈ బిల్లును జేడీయు, టీడీపీ, అన్నాడీఎంకేలు మద్దతు ఇచ్చినప్పటికీ పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయ తీసుకుంది. 
 
1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలపగా, కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. 
 
వైసీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాల డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. దీనిని జేపీసీకి పంపిస్తామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
 
చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు బిల్లును తీసుకువచ్చారు. దీని ద్వారా వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పాదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయనున్నారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటుచేసుకోనున్నాయి.