శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (16:13 IST)

వైద్యుల్ని చితకబాదిన అనంత్ కుమార్ హెగ్డే.. సీసీటీవీలో రికార్డ్.. అమ్మ కోసం..?

కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్

కర్ణాటక ఎమ్మేల్యే అనంత్ కుమార్ హెగ్డే తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇస్లాం మతానికి తీవ్రవాదానికి ముడిపెడుతూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా మరోసారి అనంత్ కుమార్ హెగ్డే వార్తల్లోకెక్కారు. ఈసారి వైద్యులపై చేజేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ ముగ్గురు వైద్యులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని అనంత్ కుమార్ హెగ్డే కార్వార్ లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సరైన చికిత్స అందించలేదని ఆరోపిస్తూ వైద్యులు మధుకేశ్వరజీవి, బాలచంద్ర, రాహుల్ మర్షకర్ అనే వైద్యులపై ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ దాడిలో వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకుంటున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీనిపై కేసు ఇంకా నమోదు కాలేదు.