గురువారం, 23 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 22 సెప్టెంబరు 2022 (18:34 IST)

సినీ స్టైల్‌లో గొడవకు దిగిన విద్యార్థులు.. కారు ఢీకొన్నా ఆగలేదు..

students
students
యూపీలో రోడ్డుపై విద్యార్థులు గొడవకు దిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యూపీ గాజియాబాద్‌లోని నడిరోడ‍్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. 
 
ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరిని ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్‌మీద పడి కింద పడ్డాడు. అయినా ఫైటింగ్‌ ఆపలేదు.. కింద పడ్డ యువకుడు పైకి లేచి మరీ గొడవను కంటిన్యూ చేశారు. 
 
దీంతో గొడవ ఆగలేదు కదా గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. స్థానికులు అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. యువకుల ఘర్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పోలీసుల రాకను గమనించిన యువకులు.. అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం పోలీసులకు చిక్కారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఇక విద్యార్థులకు భీకర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ఫక్కీలో వీరు ఫైట్ చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
సినీ స్టైల్‌లో గొడవకు దిగిన విద్యార్థులు.. కారు ఢీకొన్నా ఆగలేదు.. Watch: Ghaziabad students brawl on road, two hit by car Watch, Ghaziabad, students, brawl on road, car, యూపీ, గాజియాబాద్, వీడియో యూపీలో రోడ్డుపై విద్యార్థులు గొడవకు దిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యూపీ గాజియాబాద్‌లోని నడిరోడ‍్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరిని ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్‌మీద పడి కింద పడ్డాడు. అయినా ఫైటింగ్‌ ఆపలేదు.. కింద పడ్డ యువకుడు పైకి లేచి మరీ గొడవను కంటిన్యూ చేశారు. దీంతో గొడవ ఆగలేదు కదా గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. స్థానికులు అడ్డుకున్నా ప్రయోజనం లేకపోయింది. యువకుల ఘర్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పోలీసుల రాకను గమనించిన యువకులు.. అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం పోలీసులకు చిక్కారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక విద్యార్థులకు భీకర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ఫక్కీలో వీరు ఫైట్ చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.