గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (13:31 IST)

రాయల్స్‌ బాడీగార్డ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. ఎందుకంటే?

queen elizabeth
బ్రిటన్‌ను సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవలే తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రాణి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్‌ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్‌ హాల్లో ఉంచుతారు.

ఇందులో భాగంగా రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్‌ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్‌ కోటకు తరలించారు. 
 
మంగళవారం అక్కడి నుంచి విమానంలో లండన్‌కు తీసుకొచ్చారు. వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో క్వీన్స్ శవపేటికను కాటాఫాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు. రాణి పార్థివదేహాన్ని సందర్శించి పెద్ద సంఖ్యలో ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.
 
ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తున్న రాయల్స్‌ బాడీగార్డ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
 
అప్పటి వరకు నిలుచున్న ఓ గార్డ్‌.. కిందపడిపోవడంలో అక్కడున్న ఇతర గార్డ్స్‌ అతడి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. కాగా, సదరు గార్డ్‌ నీరసంగా ఉన్న కారణంగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.