సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (20:11 IST)

సంగారెడ్డిలో టోర్నడోలు... నీటిపై సుడులు తిరుగుతూ..

tornadoes
అమెరికాలో టోర్నడోలు అధికంగా కనిపిస్తూ వుంటాయి. ఈ టోర్నడోలు ఏర్పడిన ప్రాంతాల్లో భారీ బీభత్సాన్ని సృష్టిస్తుంటాయి. దేశంలో మాత్రం టోర్నడోలు ఎక్కువగా కనిపించవు. అయితే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు వద్ద ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
 
నీటిపై సుడులు తిరుగుతూ నది నుంచి నీటిని ఆకాశం పైకి పీల్చుకుంటున్నట్లుగా కనిపించింది. ఇది చూడటానికి టోర్నడోల మాదిరిగా కనువిందు చేసింది. నది నుంచి ఆకాశం వైపు తెల్లని ధార వెళ్తున్న దృశ్యాలు స్థానికులు తమ సెల్ ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.