శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:15 IST)

రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది..(video)

Bridge
Bridge
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రారంభోత్సవానికి సిద్దమైన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తుండగానే కుప్ప కూలింది. వానాకాలం కావడంతో.. స్థానికులు నదిని దాటేందుకు ఒకచిన్న బ్రిడ్జ్ ను నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్ గా అక్కడి అధికారులు స్వాగతించారు. 
 
అధికారి అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే.. బ్రిడ్జ్ కిందికి పడిపోతున్న సమయంలో అలర్ట్‌ యిన అధికారి ముందుకు దూకడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
ఆమెను సురక్షితంగా కిందకు దించారు. ఆ..తరువాత సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే.. ప్రారంభోత్సవం రోజునే ఇలా బ్రిడ్జ్ కూలిపోవడంతో నిర్మాణ నాణ్యత, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.