సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2016 (14:23 IST)

జయలలితకు ''ఎంబాల్మింగ్ '' చేశారా? చెంపపై హోల్స్ సంగతేంటి? డిసెంబర్ 5 కంటే ముందే చనిపోయారా?

దివంగత సీఎం జయలలితకు ఎంబాల్మింగ్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చనిపోతే వారి డెడ్‌బాడీ పాడుకాకుండా ఉండేందుకు డాక్టర్లు ఎంబాల్మింగ్ చేస్తుంటారు. దేహాన్ని మందులతో శుద్ధి చేయడమే కాకుండా

దివంగత సీఎం జయలలితకు ఎంబాల్మింగ్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చనిపోతే వారి డెడ్‌బాడీ పాడుకాకుండా ఉండేందుకు డాక్టర్లు ఎంబాల్మింగ్ చేస్తుంటారు. దేహాన్ని మందులతో శుద్ధి చేయడమే కాకుండా బాడీలోపలి భాగాలు కుళ్లిపోకుండా ఉండేందుకు సూది కూడా వేస్తుంటారు.  సహజంగా మెడ వెనుక, గజ్జల్లో ఈ సూదిని వేస్తుంటారు. కానీ జయలలిత బుగ్గపై రంధ్రాలుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
సోషల్ మీడియాలో జయలలితకు సంబంధించిన కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. జయలలిత చనిపోయిన తర్వాత ఆమె భౌతికకాయాన్ని చాలామంది తిలకించారు. ఐతే, ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఎందుకున్నాయని ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. చెంపపైన నల్లటి హోల్స్ ఏమిటి? అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. 
 
ఎవరైనా చనిపోతే వారి డెడ్‌బాడీ పాడుకాకుండా ఉండేలా డాక్టర్లు 'ఎంబాల్మింగ్ ' చేస్తుంటారు. కానీ, జయలలిత పార్థీవ దేహానికీ ఈ తరహా ప్రక్రియ నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. 72 రోజులపాటు ఆసుపత్రిలోవున్న జయలలిత, గుండెపోటు వచ్చినప్పటి నుంచి మరణించే సమయం వరకు డాక్టర్లు 'ఎక్మో' ట్రీట్‌మెంట్ చేశారు.

ఆ క్రమంలో ఎంబాల్మింగ్ చేసి వుండవచ్చుననే ఒపీనియన్ వ్యక్తమవుతోంది. జయ డిసెంబర్ 5 కంటే ముందుగానే చనిపోయారని, బాడీ పాడవకుండా ఈ తరహా ట్రీట్‌మెంట్ చేసి వుంటారని మరికొందరు వాదిస్తున్నారు.