సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:50 IST)

సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు ఇళ్లకు వెళ్లం : రాకేశ్‌ తికాయత్‌

సాగు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇళ్లకు వెళ్లబోమని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికెయు) నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.

హర్యానాలోని చార్‌ఖీ దాద్రిలో నిర్వహించిన 'కిసాన్‌ మహా పంచాయత్‌'ను ఉద్దేశించి రాకేశ్‌ తికాయత్‌ ప్రసంగిస్తూ.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ కొనసాగుతోన్న అన్నదాతల ఆందోళన ప్రజా ఉద్యమమని, అది ఎప్పటికీ విఫలం కాబోదన్నారు.

రైతులకు మేలు చేయని ఈ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని, ఇళ్లకు వెళ్లబోమని తేల్చి చెప్పారు.

పంట ఉత్పత్తులకు మద్దతు ధర ఇచ్చేలా కొత్త చట్టాన్ని చేయడంతోపాటు ఇటీవల అరెస్ట్‌ చేసిన రైతు నేతలను విడుదల చేసే వరకు తాము ఇళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు.