మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (18:34 IST)

గ్రహాలపై కష్టాలు పడుతున్నా రక్షిస్తాం : దిమ్మదిరిగేలా రిప్లై ఇచ్చిన సుష్మా స్వరాజ్

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. విదేశాల్లో ఉంటూ కష్టాల్లో కూరుకున్న భారతీయులను రక్షించడంలో ముందుంటారు. ఇలాంటి బాధితులను మంత్రి ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్వి

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. విదేశాల్లో ఉంటూ కష్టాల్లో కూరుకున్న భారతీయులను రక్షించడంలో ముందుంటారు. ఇలాంటి బాధితులను మంత్రి ఆదుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఆమె చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.
 
కరణ్ సైనీ అనే నెటిజన్ సుష్మా స్వరాజ్‌ను ఉద్దేశించిన ఓ ట్వీట్ చేశారు. "నేను మార్స్‌పై చిక్కుకుపోయా. మంగళ్‌యాన్ ద్వారా మీరు పంపిన ఆహారం అయిపోయింది. మంగళ్‌యాన్-II ఎప్పుడు పంపిస్తారు?" అనేది ఆ ట్వీట్ సందేశం. 
 
ఈ ట్వీట్‌ను చూడగానే సుష్మా స్వరాజ్ కూడా తనదైనశైలిలో స్పందించారు. "భారతీయులు ఎక్కడ చిక్కుకున్నా భారత రాయబార కార్యాలయం సాయం చేస్తుంది. చివరికి గ్రహాలపైనైనా" అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్ అయింది. 
 
అయితే, కరణ్‌పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రితో జోకులేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాగా పనిచేసే మంత్రిపై ఇటువంటి అర్థంపర్థం లేని ట్వీట్లేంటంటూ మండిపడుతున్నారు.