గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (22:50 IST)

ఇయర్స్ ఫోన్స్ ముగ్గురి ప్రాణాలు తీసింది.. ఎలాగంటే.?

railsay track
ఇయర్స్ ఫోన్స్ ద్వారా పాటలు వింటూ రైలు పట్టాలు దాటుతూ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇయర్ ఫోన్స్ చెవులు పెట్టుకుని రైలు పట్టాలు దాటి ముగ్గురి ప్రాణాలను తీసింది. యూపీలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. 
 
భదోహీ రైల్వే స్టేషన్‌లో ఇద్దరు, అహీంపూర్ రైల్వేహాల్ట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణ అలియాస్ బంగాలీ (20), అతడి స్నేహితుడు మోను (18) మధ్యాహ్న భోజనం అనంతరం భదోహి రైల్వే స్టేషన్‌కు సమీపంలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. వారు పట్టాల మధ్య నుంచి నడుస్తుండగా హౌరా-లాల్కువాన్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. 
 
ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కృష్ణ, మోనుకు రైలు చప్పుడు వినపడలేదు. వారిద్దరిని రైలు ఢీ కొట్టడంతో ఎగిరిపడి ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరు ఇంటికి రాకపోవడంతో రైల్వే స్టేషన్ సమీపానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.