గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (17:51 IST)

లంచం ఇవ్వలేదనీ స్కూటరిస్టును చంపేసిన బెంగాల్ పోలీసులు

హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు.

హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రద్దీ కూడలిలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో సౌమెన్ దేబ్‌నాథ్ (49) హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నాడు. దీన్ని గుర్తించిన బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు ఆయనను ఆపారు. హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
దీంతో వలంటీర్లు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. స్థానికులు ఆయనను కాపాడేందుకు వెళ్ళారు. దీన్ని గమనించిన పోలీసు వాలంటీర్లు పారిపోయారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన దేబ్‌నాథ్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన ఆసుపత్రిలో మరణించారు. దీంతో మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెగ్యులర్ పోలీస్ సిబ్బంది, సివిక్ పోలీస్ వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.