శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (17:55 IST)

సెక్స్ రాకెట్ గుట్టురట్టు... రష్యా - గోవా బ్యూటీల అరెస్టు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరం ఇపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతి నిత్యం ఏదో ఒక నేరం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగ

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరం ఇపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతి నిత్యం ఏదో ఒక నేరం వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. 
 
జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మఫ్టీలో గాలింపు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో వ్యభిచార కేంద్ర ప్రధాన నిర్వాహకుడు ఫయాజ్‌ను అరెస్టు చేశారు. 
 
అలాగే, ముంబై, రష్యా, గోవాకు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫయాజ్ రెండేళ్లుగా ప్రశాసన్ నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.