శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (12:16 IST)

గంగానది ఘాట్ వద్ద జారిపడిన మోదీ.. వీడియో వైరల్

పవిత్ర గంగానది వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జారి పడ్డారు. ప్రధాని ఆదివారం పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు.. ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. 
 
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ గంగానదీలో పర్యటించారు. అయితే ఈ విహారానికి ముందు ఆయన మెట్లు ఎక్కుతూ జారిపడ్డారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాన్పూర్‌లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. కానీ వెంటనే అప్రమత్తమైన సెక్యూరటీ అధికారులు, ప్రధానిని పట్టుకుని లేపారు.