1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 మే 2025 (19:41 IST)

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

golden temple
పంజాబ్ రాష్ట్రంలోని స్వర్ణ దేవాలయంపై పాకిస్థాన్ దాడికి యత్నించింది. ఈ విషయాన్ని పసిగట్టిన భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణదేవాలయం ఆనవాళ్లు కనిపించకుండా లైట్లు ఆర్పివేసింది. పాక్ క్షిపణులను గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యం సమర్థంగా దాడిని తిప్పికొట్టింది. ఆలయం నిర్వాహకుల పూర్తి సహకారం అందించారు. 
 
ఈ ఘటనపై లెఫ్టినెంట్ జనరల్ సుమర్ ఇవాన్ మరిన్ని వివరాలను వెల్లడిస్తూ, దేశంలో అంతర్గత అశాంతిని రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్‌‍ ఇక్కడి ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడవద్దని మేం ముందే అంచనా వేశాం. మా అంచనాలకు అనుగుణంగానే, పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంపై దాడికి పాక్ కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాలు నుంచి మాకు ఖచ్చితంగా సమాచారం అందింది అని పేర్కొన్నారు. 
 
"అమృతసర్‌‍లోని స్వర్ణదేవాలయానికి ముప్పు పొంచివుందని తెలియజేయగానే, ఆలయ నిర్వాహకులు మాకు అన్ని విధాలుగా సహకరించారు. ఆయుధాలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు అక్కడి ప్రధాన గ్రంథి సైనికులకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేశారు. ఇది చాలా కీలకం అని ఆయన గుర్తు చేశారు. 
 
దేవాలయంలోని ముఖ్యమైన ప్రదేశాల్లో మా సైనికులు ఆయుధాలతో మొహరించడానికి అనుమతి లభించింది. అంతకుమించి పాక్ ప్రయోగించే క్షిపణులను స్పష్టంగా గుర్తించడానికి వీలుగా స్వర్ణదేవాలయంలోని లైట్లు ఆపివేయించారు. బహుశా చరిత్రలో అన్ని సంవత్సరాలుగా వెలుగుతున్న ఆ లైట్లను ఆపివేయడం ఇదే మొదటిసారి కావచ్చు. వారి సహకారానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని తెలిపారు.