శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (14:35 IST)

జయలలిత మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ తప్పదా? చర్చనీయాంశంగా జస్టీస్ ధర్మసందేహం!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ తప్పదా? అనే చర్చ ఇపుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై సందేహాలున్నాయంటూ దాఖలైన పిటీషన్‌పై మద్రాస

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ తప్పదా? అనే చర్చ ఇపుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతిపై సందేహాలున్నాయంటూ దాఖలైన పిటీషన్‌పై మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వైద్యనాథన్ గురువారం విచారణ జరిపారు. 
 
ఈ విచారణ సంద్భంగా హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు ఆమె మృతిపై ఉన్న సందేహాలకు మరింత ఊతమిచ్చాయి. జయలలిత మృతిపై తనకు సందేహాలున్నాయని, అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని జస్టిస్ వైద్యనాథన్ వ్యాఖ్యానించారు. 
 
అందువల్ల జయలలిత అనుమానాస్పద మృతిపై సందేహాలు తొలగేందుకు ఆమె మృతదేహానికి రీపోస్ట్‌మార్టమ్ ఎందుకు చేయకూడదనే కొత్త వాదనను హైకోర్టు తెరపైకొచ్చింది. అలా చేస్తే వాస్తవాలు బయటికొచ్చే అవకాశమున్నట్లు న్యాయస్థానం భావిస్తోంది.
 
పైగా, మీడియాలో కూడా జయలలిత మృతిపై అనేక సందేహాలు వ్యక్తపరుస్తూ వార్తలొచ్చాయని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. ఏదిఏమైనా జయలలిత చికిత్సకు సంబంధించి సమగ్రమైన నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీచేశారు.