శుక్రవారం, 12 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2025 (17:27 IST)

కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లు... టేక్ హోమ్ శాలరీలో కోత?

salary
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత కార్మిక చట్టాల స్థానంలో కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, తాజాగా నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది. వీటివల్ల చాలా మంది వేతన జీవులు తీసుకునే టేక్ హోం శాలరీలో కోతపడుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కేంద్ర కార్మిక శాఖ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ లేబర్ కోడ్‌ల ప్రభావం కేవలం ఇతర అలవెన్సుల్లో కోత పడుతుందేగానీ, టేక్ హోం శాలరీలో ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. పైగా, సీటీసీలో బేసిక్ శాలరీ 50 శాతానికి పెరిగినా అలవెన్సుల్లో కోత పడుతుందే తప్ప చేతికందే వేతనంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. 
 
కొత్త లేబర్‌ కోడ్స్‌ వల్ల ఉద్యోగుల చేతికందే వేతనంలో ఎలాంటి మార్పూ ఉండబోదని కార్మిక శాఖ తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్టబద్ధ వేతన పరిమితి రూ.15 వేలుగా ఉండడమే దీనికి కారణమని తెలిపింది. ఈ పరిమితిపై కొత్త లేబర్‌ కోడ్‌ల ప్రభావం ఉండబోదు కాబట్టి చేతికందే వేతనంలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టంచేసింది. ఆ పరిమితికి మించి కాంట్రిబ్యూట్‌ చేయడమనేది స్వచ్ఛందమని, తప్పనిసరి కాదని తెలిపింది.