శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (10:54 IST)

భర్త కాళ్లు చేతులు కట్టేసి.. వదినపై మరిది అత్యాచారం..

భర్త కాళ్లు చేతులు కట్టిసి భార్యను సామూహిక అత్యాచారం చేశారు. ఈ ముఠాలోని సభ్యుల్లో ఒకటు బాధితురాలి మరిదికావడం గమనార్హం. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాకు చెందిన దంపతులు గత శనివారం బాలాజీ ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరారు. మార్గమద్యంలో బరన్‌-అత్రు రాష్ట్ర రహదారిపై ఐదుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. 
 
వారిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భర్తను బెదిరించి, భయపెట్టి దాడి చేశారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. అతడి ముందే ఆ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.
 
ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఓ వ్యక్తి బాధితురాలికి తెలిసిన వాడే కావడం గమనార్హం. తన మాజీ భర్త సోదరుడే ఈ ఘటనకు సూత్రధారి కావడం శోచనీయం. 
 
ఈ ఘటన గురించి చెప్తే మీ పరువే పోతుందని, ఆలోచించుకోమని చెప్పి మరీ వెళ్లాడా నీచుడు. షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు.. తన భర్తతో కలిసి సర్దార్ పోలీస్ స్టేషన్‌లో మరిది దినేష్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.