శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (12:25 IST)

స్విఫ్టు కారులో లిఫ్టు... మహిళపై గ్యాంగ్ రేప్ .. గ్రేటర్ నోయిడాలో దారుణం

స్విఫ్టు కార్లు లిఫ్టు ఇస్తామని చెప్పి... చుట్టపుచూపుగా వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణం ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

స్విఫ్టు కార్లు లిఫ్టు ఇస్తామని చెప్పి... చుట్టపుచూపుగా వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణం ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల ఓ మహిళ సోహ్నా ప్రాంతంలోని తన బంధువులను కలిసేందుకు గ్రేటర్ నోయిడాకు వచ్చింది. మహిళను గమనించిన ముగ్గురు యువకులు ఆమెను లిఫ్టు పేరుతో మారుతీ స్విఫ్టు కారులో ఎక్కించుకొని కదులుతున్న కారులోనే ఆమెపై ముగ్గురు గ్యాంగ్ రేప్ చేశారు. 
 
ఆపై బాధిత మహిళను కారులోనుంచి తోసేశారు. రోడ్డుపై పడి ఉన్న మహిళను పోలీసులు యాదార్ధ్ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.