శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (11:39 IST)

అసలే అక్రమ సంబంధం.. అనుమానంతో ప్రేయసి మర్మాంగంపై ఐరన్ బాక్సుతో వాత పెట్టాడు..

అసలే అక్రమ సంబంధం. ఇంకా ప్రేయసిపై అనుమానం. అంతటితో ఆగకుండా వేధించాడు. అలాగే ప్రేయసి మర్మాంగంపై ఐరన్ బాక్స్‌తో వాత పెట్టాడు.. ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన కమలేష్ అనే వ్యక్తికి వివాహమైంది. ఇతను భార్యతో కాపురం చేస్తూనే.. పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. 
 
అంతేగాకుండా ఏడాది పాటు ఆ మహిళతో సహజీవనం చేశాడు. భర్త నుంచి విడాకులు పొందిన ఆమెతో షికార్లు కొట్టిన కమలేష్.. ఆమెపై అనుమానం కూడా పెంచుకున్నాడు. ఆమెపై అనుమానంతో ఆమెతో అప్పుడప్పుడు వాగ్వివాదానికి దిగేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఫలితంగా ఆవేశానికి గురైన కమలేష్.. ప్రేయసి మర్మాంగంపై ఐరన్ బాక్సుతో వాత పెట్టాడు. 
 
ఈ ఘటనలో స్పృహ తప్పి పడిపోయిన ప్రేయసిని వదిలి కమలేష్ పారిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రేయసి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అఖిలేష్‌ను అరెస్ట్ చేశారు.