ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (11:38 IST)

రోడ్డుపై మహిళ ప్రసవం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..?

Woman Delivers Baby
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ రోడ్డు పక్కన ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్రంలోని పన్నా జిల్లాలో జరిగింది. నిండు గర్భిణిని ప్రసవం కోసం అంబులెన్స్‌లో తీసుకెళుతుండగా అంబులెన్స్‌లో ఇంధన్ అయిపోయింది. దీంతో ఆ రోడ్డుపక్కనే మహిళకు ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పన్నా జిల్లాలోని బనౌలీలోని షానగర్‌కు చెందిన రేష్మా నిండు గర్భిణి. శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలుకావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. 
 
అయితే, కొంతదూరం వెళ్లిన తర్వాత అంబులెన్స్‌‍లో డీజిల్ ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనే ప్రసవించే పరిస్థితి ఉండటంతో మరోమార్గం లేక రోడ్డుపక్కనే చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ఆమెకు ప్రసవం చేశారు. దీనికి సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.