బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (13:48 IST)

ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుంది : బాంబే హైకోర్టు

judge
ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం ఎలా అవుతుందని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. పైగా, వివాహమైన మహిళ చేసే ఇంటి పనులన్నీ కుటుంబం కోసమే వస్తాయని, ఇవి క్రూరత్వం కిందక రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఇంట పనులు చేయమని చెప్పినంతనే పనిమనిషితో పోల్చడం సరికాదని చెపుతూ విడిపోయిన భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన ఓ వివాహిత హెట్టిన గృహహింస కేసును కోర్టు కొట్టివేసింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, వివాహమైన నెల రోజుల్లోనే తన భర్తతో పాటు అత్తమామలు ఓ ఇంటి పనిమనిషిలా చూడటం ప్రారంభించారని, కారు కొనుక్కునేందుకు రూ.4 లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించారని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
దీనిపై తాజాగా ఔరంగాబాద్ బెంచ్ తాజాగా విచారణ జరిపింది. పెళ్లయిన మహిళను ఇంటి పనులు చేయమని అడగం అంటే అది ఖచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని, దాన్ని పని మనిషి చేసే పనితో పోల్చడం సరికాదని పేర్కొంది. 
 
తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం.. సెక్షన్ 498ఏ కింద ఈ కేసు వర్తించదని స్పష్టం చేస్తూ ఆ కేసును కొట్టివేసింది.